తిరువీర్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న తాజా చిత్రం మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రవి పనస ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంపై రవి పనస నిర్మిస్తున్నారు. గోపి.జి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ముహూర్తపు సన్నివేశానికి బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ క్లాప్‌నివ్వగా, నిర్మాత రవి పనస కెమెరా స్విఛాన్ చేశారు. తొలి సన్నివేశానికి డైరెక్టర్ వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. ‘పీరియాడిక్ చిత్రమిది.
పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించబోతున్నాం. ఈ నెల 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. తెలుగు తెరపై సరికొత్త ప్రయత్నంగా పేరు తెచ్చుకుంటుంది’ అని దర్శకుడు తెలిపారు. రిషి, రవీందర్ విజయ్, షెల్లీ కిషోర్, కాలకేయ ప్రభాకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాజ్‌తోట, సంగీతం: కె.పి, ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ, ఎడిటర్: ప్రవీణ్ పూడి, సమర్పణ: ఏషియన్ ఫిల్మ్స్ నారాయణ దాస్ నారంగ్, పనస శంకరయ్య గౌడ్, నిర్మాత: రవి పనస, రచన-దర్శకత్వం: గోపి.జి.