పాన్ ఇండియా సినిమా పొన్నియన్ సెల్వన్ (Ponniyin Selvan) విడుదల టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ తో బిజీగా ఉంది టీం. మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో రెండు పార్టులుగా తెరకెక్కుతుంది. కాగా పొన్నియన్ సెల్వన్-1 (Ponniyin Selvan-1) సెప్టెంబర్ 30న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఏదో ఒక అప్డేట్తో వార్తల్లో నిలుస్తున్న ఈ మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టు గురించి తాజా అప్డేట్ ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
అదేంటంటే ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆయా భాషల్లో స్టార్ హీరోలకు వాయిస్ ఓవర్ అందిస్తున్న స్టార్ యాక్టర్ల జాబితా ఇపుడు ఇంటర్నెట్లో రౌండప్ చేస్తోంది. కమల్ హాసన్, చిరంజీవి, మమ్ముట్టి, ఉపేంద్ర, అజయ్ దేవ్గన్ వారి మాతృక భాషల్లో మల్టీస్టారర్‌కు వాయిస్ ఓవర్ అందిస్తుండటం విశేషం.
ఈ లెక్కన మరికొంతమంది స్టార్ హీరోలు కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం అవుతున్నారన్న మాట. ఈ మధ్య కాలంలో వస్తున్న అత్యంత భారీ మల్టీస్టారర్ ఇదే అని చెప్పక తప్పదు. భారీ మల్టీస్టారర్‌గా పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్రమ్, కార్తీ, జయం రవి, శరత్‌కుమార్, జయరామ్, విక్రమ్ ప్రభు, పార్థీబన్, ప్రకాశ్ రాజ్, అరవింద్ స్వామి, శోభితా ధూళిపాళ, ఐశ్వర్యారాయ్ (Aishwarya Rai), త్రిష (Trisha) కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
పొన్నియన్ సెల్వన్ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లు తెరకెక్కిస్తున్నాయి. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.