OTT | ప్రతి వారం థియేటర్స్‌లో, ఓటీటీలో పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. థియేటర్స్‌లో మంచి సినిమాలు విడుదల అవుతున్నా కూడా ఓటీటీలో వచ్చే కంటెంట్‌పై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తూనే ఉన్నారు. ఈ వారం థియేటర్ లో పలు సినిమాలు ప్రేక్షకులని అలరించేందుకు రెడీగా ఉన్నాయి. వాటిలో ప్రధానంగా శ్రీ విష్ణు సింగిల్, సమంత నిర్మాతగా వ్యవహరిస్తోన్న శుభం చిత్రాలు ఉన్నాయి. ఈ సినిమాల ట్రైలర్, టీజర్స్ మూవీపై భారీ అంచనాలు పెంచాయి. ఇక వీటితో పాటు శ్రద్ధా శ్రీనాధ్ కలియుగమ్-2064, నవీన్ చంద్ర బ్లైండ్ స్పాట్ వంటి సినిమాలు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనున్నాయి.
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి కూడా థియేటర్స్‌లో రీరిలీజ్ కానుంది. ఈ క్లాసికల్ మూవీని థియేటర్స్‌లో చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఓటీటీల విషయానికి వస్తే. .ఈ వారం ఎంటర్ టైన్మెంట్ మాములుగా లేదు. తలా అజిత్ నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ ఈ వారంలోనే స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.. అలాగే ప్రదీప్, దీపికా పిల్లి నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ కూడా ఈ వారంలోనే ఓటీటీలో అందుబాటులోకి రానుంది.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే సినిమలు చూస్తే.. ది మ్యాచ్ (సినిమా)- మే 7, లాస్ట్ బుల్లెట్ (సినిమా)- మే 7, గుడ్ బ్యాడ్ అగ్లీ (తమిళ/తెలుగు)- మే 08, ది హాంటెడ్ అపార్ట్మెంట్ ‘మిస్సిక్’ (సినిమా)- మే8, బ్యాడ్ ఇన్ఫ్లూయెన్స్ (సినిమా) మే 8, ది డిప్లొమ్యాట్ (సినిమా)- మే 9, ది రాయల్స్ (వెబ్‌సిరీస్)- మే 9 స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో లో చూస్తే.. గ్రామ్ చికిత్సాలయమ్ (హిందీ) -మే 09 నుండి స్ట్రీమ్ కానుండగా, ఈటీవీ విన్ లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (తెలుగు)- మే 08 నుండి స్ట్రీమ్ కానుంది. జియో హాట్‌స్టార్ లో చూస్తే.. స్టార్ వార్స్ (యానిమేషన్)- మే 04 నుండి స్ట్రీమ్ కానుంది. యువ క్రైమ్ ఫైల్స్ (మూవీ)- మే 5 నుండి, పోకర్ ఫేస్ (వెబ్‌సిరీస్)- మే 9 నుండి స్ట్రీమ్ కానుంది.