Kareena Kapoor | ‘మనిషిగా పెరుగుతూ, మానసికంగా ఎదుగుతూ ముందుకెళ్లాను. అనుకున్నది సాధించడం, దానికోసం ఎంతైనా శ్రమించడం నా నైజం. ఒకరితో మంచిచెడూ చెప్పించుకోవడం నాకు ఇష్టం ఉండదు. నాజీవితంపై నాకు ఓ అవగాహన ఉంది’ అన్నారు బాలీవుడ్ నటి కరీనా కపూర్. తాజా ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను ఆమె పంచుకున్నారు. ‘కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే సైఫ్ అలీఖాన్ని పెళ్లాడాలని నిశ్చయించుకున్నా.
నా నిర్ణయం బహిర్గతం కాగానే.. నా చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి నాకు చాలా హెచ్చరికలు వచ్చాయి. కొందరైతే పెళ్లి చేసుకుంటే కెరీర్ ముగిసిపోయినట్టే అని భయపెట్టడానికి ప్రయత్నించారు. నేను ఎవరి మాటలూ లెక్క చేయలేదు. కెరీర్ ముగిసిపోవాలని రాసుంటే మనం మాత్రం ఏం చేయగలం? అంటూ వారిని ఎదురు ప్రశ్నించా. నిజానికి పెళ్లయ్యాకే నేను ఎక్కువ వర్క్ చేశా. వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్లా. నా వర్క్లైఫ్పై ఆసక్తి పెంచుకున్నా. నన్ను నేను నమ్ముకోవడం వల్లే ఈ విజయం నాకు సాధ్యమైంది’ అంటూ చెప్పుకొచ్చింది కరీనా కపూర్.