Vijay Deverakonda | అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కింగ్డమ్. ఈ చిత్రం జూలై 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా నేడు ప్రెస్ మీట్‌ను నిర్వహించారు మేకర్స్. ఈ ప్రెస్ మీట్లో విజయ్ మాట్లాడుతూ.. హిట్టు కొట్టాలనే ప్రెషర్ ప్రతి ఒక్కరికి ఉంటుందని తెలిపాడు. గత కొన్ని రోజులుగా విజయ్‌కి సరైన విజయాలు లేవన్న విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాతో ఎలాగైన ఫామ్‌లోకి రావాలని చూస్తున్నాడు. అయితే దీనిపై రిపోర్టర్ అడుగుతూ.. హిట్టు కొట్టాలనే ప్రెషర్ ఉందా మీ భుజాలపై ఉందా అని విజయ్‌ని అడుగగా..?
విజయ్ సమాధానమిస్తూ.. ఒత్తిడి అనేది ఎప్పుడు ఉంటది.. అది తప్పదు. కానీ ఎవరికి ఉండదు ప్రెషర్. నాకు సినిమా హిట్టు కొట్టాలని ఉంటది. నా నిర్మాతకు మంచి కలెక్షన్లు రావాలని ఉంటది. డిస్ట్రిబ్యూటర్స్ సినిమాను కొంటున్నారు వారికి డబ్బులు రావాలని ఉంటది. ఆడియన్స్ మనల్ని ఇంత ప్రేమిస్తున్నారు. వాళ్ళు ఎంజాయ్ చేసేలాగా సినిమా తీయాలి అని ఉంటది. ఇది ప్రతి ఒక్కరి విషయంలో ప్రెషర్ అనేది కామనే. నా విషయంలో కూడా అది ఉంటుంది. నాకు కూడా సినిమా హిట్టు అవ్వాలని ప్రెషర్ ఎప్పుడు ఉంటుందంటూ విజయ్ చెప్పుకోచ్చాడు.