Sonakshi Sinha | గత ఏడాది జూన్‌లో తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ని పెళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది బాలీవుడ్ అందాలభామ సోనాక్షి సిన్హా. తన తాజా ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లి, వైవాహిక జీవితం గురించి ఆసక్తికరంగా మాట్లాడింది సోనాక్షి. ‘పెళ్లికి ముందు ఏడేండ్లు మేం డేటింగ్లో ఉన్నాం. కానీ ప్రపంచానికి తెలీదు. మా బంధం మా వ్యక్తిగతం. ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం లేదని భావించాం. చెబితే ఏదిపడితే అది రాసేస్తారు. పైగా దిష్టి తగిలే అవకాశం ఉంది. అందుకే చెప్పలేదు.
ఏడేండ్ల తర్వాత ఇద్దరం కలిసి పెళ్లి నిర్ణయం తీసుకున్నాం. పెళ్లి జీవితంలో మరపురాని ఘట్టం. అందుకే గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకున్నాం. ముందు పెద్దల అంగీకారం తీసుకున్నాం. ఆత్మీయులు, మమ్మల్ని ప్రేమించేవాళ్ల సమక్షంలో సింపుల్‌గా సెలబ్రేట్ చేశాం. మా పెళ్లిలో హాజరైన అందరూ మమ్మల్ని ప్రేమించేవారే కావడం విశేషం. వారందరి దీవెనల వల్లే ఇప్పుడు భార్యాభర్తలుగా ప్రతి క్షణాన్నీ ఎంజాయ్ చేస్తున్నాం’ అంటూ చెప్పుకొచ్చింది సోనాక్షి.