Ada sharma | బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఉదంతం యావత్ దేశాన్ని కలచివేసింది. నాలుగేళ్ల క్రితం ముంబయిలోని సొంత అపార్ట్మెంట్లో ఆయన ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ మరణానంతరం ఆయన ఇంటిని కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ముంబయిలో పేరొందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ సైతం ఇల్లు అమ్మకం కష్టమని తేల్చిచెప్పారు. అయితే బాలీవుడ్ నటి ఆదాశర్మ ఆ ఇంటిని కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు వార్తలొచ్చాయి.
తాజాగా ఆమె ఈ విషయాన్ని ధృవీకరించారు. సుశాంత్‌సింగ్ ఇంటిని కొనుగోలు చేశానని, ప్రస్తుతం తాను అదే ఇంట్లో ఉంటున్నానని తెలిపింది. ‘నెల క్రితమే ఆ ఇంటిలోకి మారాను. మొదటి అంతస్తుని మొత్తం గుడిగా మార్చాను. ఈ ఇంట్లో అడుగుపెట్టగానే పాజిటివ్ వైబ్స్ కనిపించాయి. ఇంటిని పూర్తిగా ఆధునీకరించాను. ప్రత్యేకంగా మ్యూజిక్ రూమ్, డ్యాన్స్ స్టూడియోలను ఏర్పాటు చేశాను. టెర్రస్‌ను మొత్తం గార్డెన్‌లా మార్చేశా’ అని చెప్పింది.