Paradha Movie | మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameshwaran) లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘పరదా’(Paradha). ఈ సినిమాకు సినిమా బండి(Cinema Bandi Fame), శుభం సినిమాల ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల (Praveen Kandregula) దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీధర్ మక్కువ, విజయ్ డొంకాడ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగష్టు 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ‘యత్ర నార్యస్తు పూజ్యంతే..’ థీమ్ ఆఫ్ పరదా సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటకు వనమాలి సాహిత్యం అందించగా.. అనురాగ్ కులకర్ణి పాడాడు. గోపి సుందర్ సంగీతం అందించాడు.
సంప్రదాయపు కట్టుబాట్లు మహిళలను ఎలా అణచివేస్తున్నాయి. ఎలా ఎదగకుండా అణగదొక్కుతున్నాయి.. వాటిని దాటి మహిళలు ఎలా ఎదుగుతున్నారు అనే సోషియో డ్రామా కథాంశంతో ఈ సినిమా రాబోతుంది. మలయాళ నటి దర్శన.. సంగీత ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు.