హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘దీవాన’. శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. జూన్ 19న ప్రేక్షకుల ముందుకురానుంది. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా గురువారం ‘తెల్లపోరి..’ అనే పాటను విడుదల చేశారు.
ఈ పాటకు ఈశ్వర్‌చంద్ స్వరాల్ని సమకూర్చడంతో పాటు సాహిత్యాన్ని కూడా అందించారు. ప్రేయసిని సరదాగా టీజ్ చేస్తూ ప్రియుడు పాడే పాట ఇదని, విజువల్స్ ఆకట్టుకునేలా ఉంటాయని మేకర్స్ తెలిపారు. వన్‌సైడ్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా నేటి ట్రెండ్‌కు తగినట్లుగా ఉంటుందని, యువతకు బాగా నచ్చుతుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఈశ్వర్‌చంద్, రచన-దర్శకత్వం: శ్రీకాంత్ సంగిశెట్టి.