జనాల్లేక థియేటర్స్ మూసుకుంటున్న యాజమాన్యం
థియేటర్స్ | 2021లో తొలిసారి ఓ శుక్రవారం పూర్తిగా కనుమరుగైపోయింది. 3 చెప్పుకోదగ్గ సినిమాలు విడుదలైనా ఒక్కటి కూడా చెప్పుకునేలా కలెక్షన్స్ సాధించలేదు.

థియేటర్స్ కరోనా వైరస్ కారణంగా 8 నెలల పాటు మూతబడ్డాయి. ఆ తర్వాత 50 శాతం ఆక్యుపెన్సీతో తెరిచారు. ఇప్పుడు 100 శాతం పెంచేశారు. అయితే అలా చేసినా కూడా చూడ్డానికి ప్రేక్షకులు థియేటర్స్ వరకు రావాలి కదా అనే అనుమానాలు ఉండేవి. వాటిని కూడా తుడిచేస్తూ ఈ మధ్య చాలా సినిమాలు సంచలన వసూళ్లు సాధించాయి. ఎన్నో సినిమాలు మంచి విజయం కూడా అందుకున్నాయి. ప్రతీ శుక్రవారం కనీసం మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అయితే అందులో కనీసం ఒక్కటైనా హిట్ అయ్యేది. కానీ 2021లో తొలిసారి ఓ శుక్రవారం పూర్తిగా కనుమరుగైపోయింది. మూడు చెప్పుకోదగ్గ సినిమాలు విడుదలైనా కూడా అందులో ఒక్కటి కూడా రెండో రోజుకు చెప్పుకునేలా కలెక్షన్స్ సాధించలేదు.
గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్ నుంచి వచ్చిన చావు కబురు చల్లగా.. రూ.50 కోట్లు పెట్టి నిర్మించానని చెప్పిన మంచు విష్ణు మోసగాళ్లు.. ఆది సాయికుమార్ శశి సినిమాలకు కనీస స్పందన రాలేదు. దాంతో ఏం చేయాలో తెలియక థియేటర్స్ మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
కనీసం మెయింటైనెన్స్ ఖర్చులు కూడా రాకపోవడం.. 10 శాతం పబ్లిక్ కూడా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మార్చి 19న చావు కబురు చల్లగా, మోసగాళ్లు, శశి సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఈ మూడింటికి కూడా వసూళ్లు దారుణంగా ఉన్నాయి.
పెద్ద నిర్మాణ సంస్థ నుంచి వచ్చింది కాబట్టి చావు కబురు చల్లగా సినిమాకు తొలిరోజు 1.3 కోట్ల షేర్ వచ్చింది. కానీ రెండో రోజుకు అది కూడా లేదు.
ఇక మోసగాళ్ళు, శశి సినిమాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈ రెండు సినిమాలకు కనీసం కోటి షేర్ కూడా రాలేదు.
థియేటర్స్ లో కనీసం 10 శాతం మంది కూడా లేకపోవడంతో షోలు క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మల్టీప్లెక్సులు షోలు తగ్గించారు. సింగిల్ స్క్రీన్లు చాలా చోట్లు షోలు ఆపేశారు.
పైగా కరోనా కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. దాంతో నిర్మాతలతో పాటు ఎగ్జిబిటర్లు కూడా దిక్కు తోచని పరిస్థితుల్లో పడిపోయారు.
ఈ వారం రాబోయే అరణ్య, రంగ్ దే సినిమాలైనా ఈ పరిస్థితి మార్చేస్తాయేమో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
థియేటర్స్ మూసివేయం : మంత్రి తలసాని
రవితేజ: ముగ్గురు కుర్ర హీరోయిన్లతో రొమాన్స్
పవన్ సినిమాతో మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి విజయదేవరకొండ
కన్నడ హీరో చిరంజీవి సర్జా భార్య ఏం చేస్తుంది?
ఐశ్వర్యరాజేశ్ ఫైనల్..మరో హీరోయిన్ కోసం వేట..!
ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాపై క్లారిటీ..!
జాతీయ అవార్డుల్లో సైరాకు అన్యాయం జరిగిందా?
ముద్దు వీడియో షేర్ చేసిన జెనీలియా.. స్పందించిన ప్రీతి
ఈ ఇద్దరు కొత్త హీరోయిన్ల సుడి పీక్స్.. స్టార్ హీరోలతో ఆఫర్స్
తరుణ్ రీఎంట్రీ.. లవ్ స్టోరీతో వస్తున్నాడంట
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

