సుమన్, గరీమ చౌహన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సీతా కళ్యాణ వైభోగమే’. సతీష్ పరమవేద దర్శకుడు. రాచాల యుగంధర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ పోచంపల్లిలో జరుగుతోంది. నిర్మాత మాట్లాడుతూ ‘భారీ యాక్షన్ ఏపిసోడ్స్‌తో పాటు మంచి ఫ్యామిలీ ఎమోషన్స్‌తో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం.
ఇటీవలే గోవాలో ఓ పాటను చిత్రీకరించాం. తెలంగాణ నేపథ్యంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. దసరాకు చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’ అన్నారు.