చందు రాగం, హాసిని, ప్రీతి సుందర్ ముఖ్యతారలుగా నటిస్తున్న ‘ఉద్యమ కెరటాలు’ చిత్రం షూటింగ్ పూజా కార్యక్రమాలు ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమయ్యాయి. ప్రముఖ గీత రచయిత కాసర్ల శ్యామ్ ముఖ్య అతిథిగా విచ్చేసి యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు అందజేశారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శక, నిర్మాత పిడమర్తి రవీంద్ర మాట్లాడుతూ ‘నేటి తరం వాళ్లకు తెలంగాణ ఉద్యమ పోరాటాన్ని, దాని గొప్పదనాన్ని తెలియజేయడానికి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ చిత్రానికి కాసర్ల శ్యామ్, గోరెటి వెంకన్నలు సాహిత్యాన్ని అందిస్తున్నారు’ అన్నారు.