నాగార్జున, నాగచైతన్య హీరోలుగా తెరకెక్కిన ‘బంగార్రాజు’తో కమర్షియల్ సక్సెస్‌ను అందుకున్నారు దర్శకుడు కల్యాణ్‌కృష్ణ. ఆయన తన తదుపరి సినిమాను స్టూడియో గ్రీన్ సంస్థలో చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో శివ కార్తికేయన్ కథానాయకుడిగా నటించనున్నట్లు సమాచారం. కుటుంబ విలువలకు ప్రేమకథను మేళవించి కల్యాణ్‌కృష్ణ సిద్ధంచేసిన కథ నచ్చడంతో శివకార్తికేయన్ ఈ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కించనున్నట్లు సమాచారం.