Saiyaara Reunite | మళ్ళీ చేతులు కలిపిన ‘సయ్యారా’ టీమ్.. YRF బ్యానర్లో సరికొత్త లవ్ స్టోరీ
Saiyaara Team Reunite | బాలీవుడ్ దర్శకుడు మోహిత్ సూరి, యువ నటీనటులు అహాన్ పాండే, అనీత్ పడ్డాల కాంబినేషన్లో వచ్చిన 'సయ్యారా' (Saiyaara) చిత్రం భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Saiyaara Team Reunite | బాలీవుడ్ దర్శకుడు మోహిత్ సూరి, యువ నటీనటులు అహాన్ పాండే, అనీత్ పడ్డాల కాంబినేషన్లో వచ్చిన ‘సయ్యారా’ (Saiyaara) చిత్రం భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే టీమ్ మరోసారి ఒక మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా కోసం చేతులు కలిపారు. 2025లో విడుదలైన ‘సయ్యారా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.580 కోట్ల వసూళ్లతో ప్రభంజనం సృష్టించిన నేపథ్యంలో, అదే టీమ్ నుండి వస్తున్న ఈ కొత్త ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) బ్యానర్‌పై అక్షయ్ విదాని ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.
మోహిత్ సూరి మార్క్ ఇంటెన్సివ్ ఎమోషన్స్ మరియు హృదయాన్ని హత్తుకునే సంగీతంతో సాగే ఈ ప్రేమకథా చిత్ర షూటింగ్ ఈ ఏడాది చివరలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మోహిత్ సూరి మాట్లాడుతూ, తన సక్సెస్ఫుల్ టీమ్‌తో మళ్లీ పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని, ఈసారి అంతకంటే బలమైన కథతో ప్రేక్షకులను పలకరిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. జనరేషన్ జెడ్ (Gen Z) ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతున్న ఈ మ్యూజికల్ ఎంటర్టైనర్ను 2027లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాతో అహాన్ పాండే, అనీత్ పడ్డాల జోడీ మరోసారి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుందని చిత్ర నిర్మాణ సంస్థ ధీమా వ్యక్తం చేస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

