HomeCinemaThe Release Of Guntur Karam Pan India On January 13 Next Yea
Mahesh Babu | మిర్చి యార్డ్ ఫ్లాష్‌బ్యాక్
మహేష్‌బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నది. జూలై మొదటివారంలో కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. పూర్తి మాస్ అంశాలతో దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారని చెబుతున్నారు.
మహేష్‌బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నది. జూలై మొదటివారంలో కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. పూర్తి మాస్ అంశాలతో దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారని చెబుతున్నారు. ఇందులో మహేష్‌బాబు పక్కా మాస్ అవతారంలో కనిపిస్తారని, గుంటూరు మిర్చి యార్డ్ నేపథ్యంలో వచ్చే ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమాలో ప్రధానాకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.
పాన్ ఇండియా స్థాయిలో వచ్చే ఏడాది జనవరి 13న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ సినిమా నుంచి సంగీత దర్శకుడిగా తనను తప్పించారని వస్తున్న వార్తలపై తమన్ స్పందించారు. ‘నా ఆఫీసు వద్ద ఉచితంగా మజ్జిగ పంచుతున్నా. కడుపు మంటతో ఇబ్బందిపడేవాళ్లు వచ్చి తాగండి. నా సమయాన్ని వృథా చేయకండి. మీ టైమ్ కూడా విలువైనది’ అని తమన్ ట్విట్టర్లో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది.