Namit Malhotra | భారతీయ పురాణ ఇతిహాసం ‘రామాయణం’ మరోసారి వెండితెరపై అద్భుత దృశ్యకావ్యంగా ఆవిష్కృతం కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత నమిత్ మల్హోత్రా నిర్మాణంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి చిత్రబృందం నేడు రామ నవమి సందర్భంగా ఒక కీలక ప్రకటన చేసింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించిన ముందే ప్రకటించగా.. ఇందులో మొదటి భాగం 2026 దీపావళికి, రెండవ భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ‘రామ’ను ఏప్రిల్ 2వ తేదీన, హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా విడుదల చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల సమక్షంలో ఒక భారీ ఈవెంట్ ద్వారా ఈ సినిమా ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించనున్నట్లు నిర్మాత వెల్లడించారు. ఈ సందర్భంగా నమిత్ మల్హోత్రా స్పందిస్తూ, రామాయణం మనందరి కథ అని, ఎంతో బాధ్యత, భక్తి మరియు చిత్తశుద్ధితో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. గత కొన్నేళ్లుగా పడుతున్న శ్రమను అభిమానులకు చూపించే సమయం ఆసన్నమైందని చెబుతూ, ప్రేక్షకులు చూపుతున్న ప్రేమకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలవబోతోంది.ఈ సినిమాకు నితీష్ తివారి దర్శకత్వం వహిస్తుండగా.. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, రావణుడి పాత్రలో యష్ నటించబోతున్నారు.
Shubh Rama Navami 🏹
Thank you for your faith and patience.
On 2nd April, Hanuman Jayanti, we take the first step together.#RamayanaByNamitMalhotra
In cinemas, globally- Diwali 2026 & 2027. pic.twitter.com/BUTER2JZkw— Namit Malhotra (@malhotra_namit) March 27, 2026