రీసెంట్గా విడుదలైన ప్రభాస్ ‘ది రాజాసాబ్’ సినిమా టీజర్ ఆడియన్స్‌లో సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేసింది. అలాగే.. ఓ కొత్త ప్రశ్న ఉత్పన్నమయ్యేలా కూడా చేసింది. ఇందులో దెయ్యంలా కనిపిస్తున్న సంజయ్‌దత్ పాత్రకీ ప్రభాస్ పాత్రకీ గల సంబంధం ఏంటి? అనేదే ఆ కొత్త ప్రశ్న. టీజర్లో ప్రభాస్ ‘తాతయ్య’ అని దెయ్యాన్ని సంబోధించాడు. కథానుగుణంగా కూడా సంజయ్‌దత్ ఇందులో ప్రభాస్‌కి తాతయ్యేనట. అలాగే.. ప్రభాస్ ఇందులో డ్యూయెల్ రోల్ చేస్తున్నారు అనే రూమర్ కూడా గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంది.
దానికి బలాన్నిస్తూ సింహాసనంపై రాజాసాబ్ గెటప్‌లో కూర్చున్న ప్రభాస్ స్టిల్‌ని, రీసెంట్గా విడుదల చేసిన వింటేజ్ ప్రభాస్ స్టిల్స్‌ని నెటిజన్లు చూపిస్తున్నారు. నిజానికి ఇందులో ప్రభాస్ డ్యూయెల్‌రోల్ చేయడంలేదు. ‘బుజ్జిగాడు’నాటి వింటేజ్ ప్రభాస్‌ని గుర్తుచేసేలా ఇందులో ఆయన పాత్ర ఉంటుందట. కథానుసారం ఓ సందర్భంలో తాత దెయ్యం ప్రభాస్‌ని ఆవహిస్తుందట. ఆ సందర్భంలోనే సింహాసనంపై రాజాసాబ్గా ప్రభాస్ దర్శనమిస్తారట. అదీ అసలు విషయం.