‘ఇది నాన్నమ్మ మనవడి కథ. నా నానమ్మగా జరీనా వహాబ్ అద్భుతంగా నటించారు. ఇక సంజయ్‌దత్ గురించి చెప్పేదేముంది.. క్లోజ్ పెడితే తినేస్తారు. ఈ సినిమాకు పనిచేసిన అందరూ ప్రతిభావంతులే. నిర్మాత విశ్వప్రసాద్ ఈ సినిమాకు రియల్ హీరో. మూడేళ్ల క్రితం ఈ సినిమా అనుకున్నప్పుడు బడ్జెట్ వేరు. తర్వాత మారిన బడ్జెట్ వేరు. ఏ విషయంలోనూ ఆయన రాజీ పడలేదు. అంతా సీరియస్ సినిమాలే చేస్తున్నాను.. కొత్తగా వెళ్తే బావుంటుందని మారుతీని అడిగాను. అలా ‘ది రాజాసాబ్’ కథ రెడీ అయ్యింది. నేనైతే మారుతి రైటింగ్‌కి అభిమానిని అయిపోయా. అసలు ైక్లెమాక్స్ అయితే.. పెన్‌తో రాశాడా? మిషిన్ గన్‌తో రాశాడా? అనిపించింది. అంతబాగా రాశాడు. ఏదేమైనా చాలా ఏళ్ల తర్వాత ఎంటర్టైన్మెంట్ సినిమాతో వస్తున్నా. సంక్రాంతికి వస్తున్న సినిమాలన్నీ బాగా ఆడాలి.
వాటిలో మా రాజాసాబ్ కూడా ఉండాలి. ’ అని అగ్ర హీరో ప్రభాస్ ఆకాంక్షించారు. ఆయన హీరోగా రూపొందిన పానిండియా హారర్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ ‘ది రాజాసాబ్’. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్దికుమార్ కథానాయికలు. మారుతి దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కానున్నది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ మాట్లాడారు. ‘ఇది సాదాసీదా సినిమా కాదు. దీని వెనుక చాలా కష్టం ఉంది. అది రేపు థియేటర్లకి వచ్చిన వాళ్లకు తెలుస్తుంది. ‘ఆదిపురుష్’ టైమ్‌లో నాకు ముంబాయ్ రమ్మని ఫోన్ వచ్చింది. అప్పుడు ప్రభాస్ రాముడి గెటప్‌లో ఉన్నారు. ఆయన్ను కలవడానికి ఈ మారుతి వెళ్లాడు. అలా ‘ది రాజాసాబ్’ జర్నీ మొదలైంది. ఒక లైఫ్ పెట్టేసి, మీడియం రేంజ్ హీరోని పానిండియాకు పరిచయం చేసి, ప్రపంచం ముందు ప్రభాస్ అనే పెద్ద కటౌట్‌ని నిలబెట్టిన రాజమౌళికి ఈ సందర్భంగా థాంక్స్ చెబుతున్నా.
సుకుమార్, సందీప్‌రెడ్డి వంగా, బన్నీ, తారక్, చరణ్ ఇంతమంది పానిండియా స్టార్లు ఇక్కడ తయారయ్యారంటే కారణం ఆయనే. ఈ సినిమా విషయంలో నా వెనకున్న శక్తి ప్రభాస్. ఈ సినిమా కోసం ఆయన లైఫ్ పెట్టేశారు. మూడేళ్లు కష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చాం. ఇది ఆల్ లాంగ్వేజ్‌లో అదిరిపోతుంది. వేదిక మీద ఉండి చెబుతున్నా. ఈ సినిమాతో మిమ్మల్ని మెప్పించకపోతే నన్ను ఇంటికొచ్చి నిలదీయండి.’ అని డైరెక్టర్ మారుతి ఉద్వేగంగా అన్నా రు. ఇంకా నిర్మాత టీజీ విశ్వప్రసాద్, తమన్, ఎస్కేఎన్, కథానాయికలు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్లతోపాటు నార్త్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానీ, నటులు రోహిత్, సప్తగిరి, మ హేశ్, వీటీవీ గణేశ్, గేయ రచయిత కాసర్ల శ్యామ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.