Rebel Saab | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ విడుదలైంది. హారర్ చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ‘ది రాజా సాబ్’ నుంచి మొట్టమొదటి పాట విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ రెబల్ సాబ్ (RebelSaab)ను నవంబర్ 23న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, జరీనా వాహాబ్, రిద్ది కుమార్ కథానాయికలుగా నటిస్తుండగా బోమన్ ఇరానీ, సంజయ్ దత్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
Darling #Prabhas Style #RebelSaab Swag#TheRajaSaab vibe@MusicThaman‘s musical magic
From 23rd this month #therajasaabonjan9th @peoplemediafcy pic.twitter.com/bDcWKEe9fH— Director Maruthi (@DirectorMaruthi) November 21, 2025