‘ మంత్ ఆఫ్ మధు’ నా కెరీర్లో ప్రత్యేకమైన సినిమా. ఇందులో నా పాత్రది పెక్యులర్ మనస్తత్వం. ఉద్యోగం చేయడమంటే ఇష్టవుండదు. ఏదైనా బిజినెస్ చేయటానికి టైమ్ ఉండదు. తాగుతూ బాధ్యత లేకుండా తిరుగుతూ ఉంటా. అలాంటి నా జీవితం ఎలాంటి మలుపు తీసుకుంది అనేది ఇందులో ఆసక్తిని కలిగించే అంశం’ అన్నారు. నవీన్చంద్ర. కలర్స్ స్వాతితో కలిసి ఆయన నటించిన సినిమా ‘మంత్ ఆఫ్ మధు’. శ్రీకాంత్ నాగోతి దర్శకుడు. యశ్వంత్ ములుకుట్ల నిర్మాత.
ఈ నెల 6న సినిమా విడుదల కానుంది. నవీన్చంద్ర విలేకరులతో ముచ్చటించారు. ఈ కథ చెప్పినప్పుడు మారుమాట్లాడకుండా ఒప్పుకున్నా. నిజానికి అప్పటికే నేను చాలా బిజీ. అయినా సరే ఈ కథ, అందులోని నా పాత్ర నాకు బాగా నచ్చేశాయి. ఇందులో నా పాత్ర సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. తాగుబోతుగా కనిపిస్తాను. దానికోసం అలాంటి లైఫ్ైస్టెల్ ఉన్నవాళ్లను దగ్గరగా చూశాను. ఆ బాడీలాగ్వేజ్ కోసం చాలా కష్టపడ్డాను’ అని చెప్పుకొచ్చారు నవీన్చంద్ర. ‘ఇందులో నా పేరు మధుసూదనరావు, శ్రేయ అనే కొత్తమ్మాయి అమెరికానుంచి వచ్చిన మధుమతి పాత్ర చేసింది. ‘మంత్ ఆఫ్ మధు’ అనేది మా ఇద్దరికథ. మా ఇద్దరి వల్ల స్వాతి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నదనేది ఇందులో ఆసక్తికరమైన అంశం. పనిచేసిన అందరికీ మంచిపేరు తెచ్చిపెట్టే సినిమా ఇది.’ అన్నారు నవీన్చంద్ర.