జాతీయ స్థాయిలో ఘనవిజయం సాధించి పాన్ ఇండియా ట్రెండ్‌కు క్రేజ్ తీసుకొచ్చిన సినిమా ‘పుష్ప’. అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ రూపొందించిన ఈ చిత్రం తొలిభాగం సూపర్‌హిట్ కావడంతో రెండో సినిమా ఎప్పుడనే అంచనాలు మొదలయ్యాయి.
అందుకు ముహూర్తం సిద్ధం చేసింది చిత్రబృందం. సోమవారం ‘పుష్ప ద రూల్’ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కాబోతున్నది. రెగ్యులర్ చిత్రీకరణ ఎప్పటి నుంచి చేస్తారనేది ఈ సందర్భంగా వెల్లడించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న నాయికగా నటిస్తుండగా..దేవి శ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.