సాయి చరణ్, పల్లవి, ట్రాన్సీ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ఐక్యూ (పవర్ ఆఫ్ స్టూడెంట్స్)’. ఈ చిత్రాన్ని కాయగూరల రాజేశ్వరి సమర్పణలో కేఎల్పీ మూవీస్ పతాకంపై కాయగూరల లక్ష్మీ పతి నిర్మించారు. జీఎల్బీ శ్రీనివాస్ దర్శకుడు.
ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్ర నిర్మాత కాయగూరల లక్ష్మీపతి మాట్లాడుతూ…‘సరికొత్త కథతో ఈ సినిమాను నిర్మించాం. సైన్స్ నేపథ్యం ఉంటుంది. యువ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం’ అన్నారు.
దర్శకుడు జీఎల్బీ శ్రీనివాస్ మాట్లాడుతూ…‘మేధస్సుకు సంబంధించిన కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించాం. విద్యారంగంలోకి మాఫియా వస్తే ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అనేది ఆసక్తికరంగా చూపిస్తున్నాం’ అన్నారు.