గుల్షన్ దేవయ్య, సయామీఖేర్ జంటగా నటించిన చిత్రం ‘8 ఏ.ఎమ్. మెట్రో’. ‘మల్లేశం’ ఫేమ్ రాజ్ రాచకొండ దర్శకత్వం వహించారు. మే 19న హిందీ, తెలుగు భాషల్లో విడుదలకానుంది. ఈ సినిమాలో ప్రఖ్యాత హిందీ గీత రచయిత గుల్జార్ ఆరు కవితలను రాశారు. చిత్ర పోస్టర్ను ఆవిష్కరించిన ఆయన మాట్లాడుతూ ‘ ఈ సినిమా కథ వినగానే గొప్ప అనుభూతి కలిగింది.
వెంటనే సహకారం అందించాలనిపించింది’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘మెట్రోలో అనుకోకుండా కలుసుకున్న ఇద్దరు అపరిచితుల ప్రయాణమిది. చక్కటి ప్రేమకథగా మెప్పిస్తుంది. గుల్జార్ కవితలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి’ అన్నారు. ఈ సినిమాలోని తన పాత్రలో ఓ రహస్యం దాగి ఉంటుందని సయామీఖేర్ పేర్కొంది. ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతాన్నందించాడు.