Vijay Devarakonda | రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్డమ్’. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం జూలై 31న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ వైరల్‌గా మారింది. విజయ్ అభిమానుల కోసం ఒకరోజు ముందుగానే ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్‌ని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. విడుదల రోజు ముందు బుధవారం రాత్రి 9 గంటల నుంచి ఈ పెయిడ్ ప్రీమియర్ షోలు ఉండబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన బుకింగ్స్ త్వరలోనే విడుదల కాబోతున్నట్లు సమాచారం. గతంలో నాగవంశీ నిర్మాణంలో వచ్చిన లక్కీ భాస్కర్ కూడా పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించడం వలన మూవీ పాజిటివ్ టాక్ వచ్చి సూపర్‌హిట్‌గా నిలిచింది.
మరోవైపు ఈ సినిమా టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రం జులై 31న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుండగా.. సినిమా విడుదలైన రోజు నుంచి 10 రోజుల వరకు రేట్లు పెంచడానికి ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇక పెరిగిన ధరలను బట్టి చూసుకుంటే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50 పెంచుకోవడానికి అనుమతినివ్వగా.. మల్టీప్లెక్స్‌లలో రూ.75 పెంచుకునేందుకు అవకాశం కల్పించారు.