Mahesh Babu | హాలీవుడ్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్స్ ప్రాజెక్టుల్లో టాప్‌లో ఉంటుంది ‘ది లయన్ కింగ్’. ఈ క్రేజీ ప్రాజెక్టుకు ప్రీక్వెల్‌గా వస్తోంది ‘ముఫాసా: ది లయన్ కింగ్ (Mufasa The Lion King)’. ఇక ఈ మూవీ తెలుగు వర్షెన్‌లో ముఫాసా పాత్రకు టాలీవుడ్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) వాయిస్ ఓవర్ అందించిన విషయం తెలిసిందే.
ఈ మూవీ డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ రిలీజ్ కౌంట్ డౌన్ మొదలైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. మహేశ్ తాజాగా ఎక్స్‌లో ‘హకునా.. మటాటా’ అంటూ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. మరో నెల రోజుల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతోందని.. ముఫాసాను చూసేందుకు సిద్ధంగా ఉండండి అంటూ రాసుకొచ్చారు. ఈ మేరకు ట్రైలర్‌ను ఈ ట్వీట్‌కు జతచేశారు. ప్రస్తుతం మహేశ్ ట్వీట్ వైరల్‌గా మారింది.
Hakuna ̶M̶a̶t̶a̶t̶a̶ ̶ Mufasa it is!🦁 The new roar. 🎵
1 Month from now, get ready to watch Mufasa: The Lion King in cinemas from 20th Dec.#MufasaTheLionKing @DisneyStudiosIN pic.twitter.com/pjdeugoXec
— Mahesh Babu (@urstrulyMahesh) November 20, 2024
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాభిమానం చూరగొన్న ‘ది లయన్ కింగ్’ సిరీస్‌లో భాగంగా రాబోతున్న చిత్రం ‘ముఫాసా: ది లయన్‌కింగ్’. డిసెంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. వివిధ భారతీయ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌కు టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు వాయిస్ అందించగా.. హిందీ వెర్షన్లో ముఫాసా పాత్రకు బాలీవుడ్ యాక్టర్ షారుఖ్ ఖాన్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. పుంబా కోసం బ్రహ్మానందం, టిమోన్ పాత్ర కోసం అలీ తమ వాయిస్‌ను అందిస్తున్నారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మొదటి రెండు (The Lion King) పార్ట్‌లలో అడవికి రాజుగా ఉన్న ముఫాసా తన రాజ్యాన్ని కాపాడుతూ ఉండడం అతడికి సింబా అనే కుమారుడు జన్మించడం చూడవచ్చు. అయితే ఈ ప్రీక్వెల్‌లో ముఫాసా అడవికి రాజుగా అసలు ఎలా ఎదిగాడు అతడికి సోదరుడు ఉన్న టాకా ఎలా చనిపోయాడు…అలాగే ముఫాసా చంపాలని చూస్తున్నా స్కార్ ఏం చేశాడు అనేది సినిమా స్టోరీ. ఫొటో రియలిస్టిక్ టెక్నాలజీతో వస్తున్న ఈ సినిమాకు అకాడమీ అవార్డ్ విజేత బేరీ జెంకిన్స్ దర్శకుడు ఆరోన్ స్టోన్, కెల్విన్ హ్యారిసన్ జూనియర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read..
Viral Video | అతిథులపై నోట్ల వర్షం.. రూ.20 లక్షలు వెదజల్లిన పెళ్లివారు..VIDEO
Assembly elections | మహారాష్ట్రలో మందకొడిగా సాగుతున్న పోలింగ్