కొత్త ఏడాదిలో కథాంశాల ఎంపిక విషయంలో తన రూటు మార్చుకోవాలని ఫిక్సైపోయిందట మంగళూరు సోయగం పూజా హెగ్డే. గత ఏడాది ఈ భామకు ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. మహేష్‌బాబు ‘గుంటూరు కారం’ చిత్రం నుంచి ఈ అమ్మడు తప్పుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది. ఇక అక్కడి నుంచి ఈ భామను దురదృష్టం వెంటాడింది. సల్మాన్‌ఖాన్‌తో చేసిన ‘కిసీ కా భాయ్..కిసీ కి జాన్’ చిత్రం కూడా పరాజయం చెందడంతో హిందీలో కూడా కెరీర్ సందేహంలో పడింది. గత ఏడాది నేర్చుకున్న పాఠాలతో ఇక ముందు మహిళా ప్రధాన చిత్రాలపై దృష్టి పెట్టాలని పూజా హెగ్డే నిర్ణయం తీసుకుందట.
ఈ నేపథ్యంలో తమిళంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఏవీయం ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట పూజా హెగ్డే. ఈ భామ నటించబోతున్న తొలి మహిళా ప్రధాన చిత్రమిదే కావడం విశేషం. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించే ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కీలకమైన అతిథి పాత్రలో కనిపిస్తాడట. నాలుగేళ్ల క్రితం తెలుగులో భారీ విజయాలను దక్కించుకున్న ఈ భామ ఇటీవలకాలంలో ఒక్కసారిగా వెనక బడిపోయింది. ఈ నేపథ్యంలో కెరీర్‌ను విశ్లేషించుకునే పనిలో పడ్డ ఈ సొగసరి భవిష్యత్తులో ప్రయోగాత్మక కథలకు, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు పెద్దపీట వేయాలని నిర్ణయించుకుందట. మరి పూజాహెగ్డే ఎంచుకున్న ఈ కొత్త బాట ఎ లాంటి విజయాలను అందిస్తుందో వేచి చూడాలి!.