నాగ చైతన్య హీరోగా నటిస్తున్న సినిమా ‘థాంక్యూ’. రాశీ ఖన్నా, మాళవికా నాయర్ నాయికలుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దర్శకుడు విక్రమ్ కె కుమార్ రూపొందిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నది. ముందుగా ఈ సినిమాను జూలై 8న విడుదల చేయాలని అనుకొన్నారు.
అయితే తాజాగా రిలీజ్ డేట్‌ను జూలై 22వ తేదీకి మార్చారు. అన్ని కమర్షియల్ హంగులతో జూలై 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సందర్భంగా దర్శకుడు విక్రమ్ కె కుమార్ మాట్లాడుతూ…‘చిత్రీకరణ పూర్తి చేసుకున్న మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. రెండు లిరికల్ సాంగ్స్ శ్రోతల ఆదరణ పొందుతున్నాయి. సినిమా మీద అందరిలో అంచనాలు ఉన్నాయి. వాటిని అందుకుంటామనే నమ్మకం ఉంది’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : పీసీ శ్రీరామ్, సంగీతం : ఎస్. థమన్.