The Kerala Story 2 | ‘ది కేరళ స్టోరీ 2’ ఓటీటీ రిలీజ్ ముందుకు… కొత్త తేదీ ప్రకటించిన జీ5
The Kerala Story 2 | బాలీవుడ్లో ఇటీవల చర్చనీయాంశంగా మారిన చిత్రాల్లో ‘ది కేరళ స్టోరీ 2’ ఒకటి. గతంలో వచ్చిన ‘ది కేరళ స్టోరీ’ చిత్రం భారీ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సున్నితమైన అంశాన్ని ప్రాధాన్యంగా తీసుకుని తెరకెక్కిన ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు అదే కథకు కొనసాగింపుగా దర్శకుడు కామాఖ్యా నారాయణ్ సింగ్ ‘ది కేరళ స్టోరీ 2’ను మరింత లోతుగా, కొత్త కోణంలో తెరకెక్కించారు.
The Kerala Story 2 | బాలీవుడ్లో ఇటీవల చర్చనీయాంశంగా మారిన చిత్రాల్లో ‘ది కేరళ స్టోరీ 2’ ఒకటి. గతంలో వచ్చిన ‘ది కేరళ స్టోరీ’ చిత్రం భారీ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సున్నితమైన అంశాన్ని ప్రాధాన్యంగా తీసుకుని తెరకెక్కిన ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు అదే కథకు కొనసాగింపుగా దర్శకుడు కామాఖ్యా నారాయణ్ సింగ్ ‘ది కేరళ స్టోరీ 2’ను మరింత లోతుగా, కొత్త కోణంలో తెరకెక్కించారు. అయితే ఈ సీక్వెల్‌కు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి స్పందన మాత్రం రాలేదు. ఇదిలా ఉండగా, ఈ సినిమా ఓటీటీ విడుదలపై తాజా అప్డేట్ వచ్చింది. ప్రముఖ వేదిక జీ5 మొదట ఈ చిత్రాన్ని మే 8న స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. కానీ తాజాగా విడుదల తేదీని మార్చి, ఒక వారం ముందుకు జరిపింది. దీంతో ఇప్పుడు ఈ చిత్రం మే 1 నుంచే ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.
ఈ నిర్ణయం సినిమాను ఓటీటీలో చూడాలని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్‌గా మారింది. థియేటర్లలో మిస్సయినవారికి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు.ఈ చిత్రంలో అదితి భార్య, ఉల్కా గుప్తా, ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రల్లో నటించారు. సన్ షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై విపుల్ షా ఈ సినిమాను నిర్మించారు. థియేటర్లలో ఆశించిన ఫలితం అందుకోలేకపోయిన ‘ది కేరళ స్టోరీ 2’ ఓటీటీ వేదికపై ఎలాంటి స్పందన దక్కించుకుంటుందో చూడాలి.
ఈ చిత్రంలో గ్లామర్‌కు కంటే నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు కావడంతో నటీనటులు తమ పాత్రలను ఎంతో నిబద్ధతతో పోషించారు. ప్రతి పాత్రలోని భావోద్వేగాలు, సంఘర్షణలను ప్రేక్షకులకు బలంగా చేరేలా వారు నటనను ప్రదర్శించారు. ప్రముఖ నిర్మాత విపుల్ షా తన సన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. కథకు తగినట్టుగా నిర్మాణ విలువలు మెరుగ్గా కనిపిస్తాయి. వివాదాలను పక్కన పెడితే, సమాజంలో జరుగుతున్న కొన్ని అంశాలను వెలుగులోకి తీసుకురావాలనే ప్రయత్నం చిత్ర బృందం నుంచి స్పష్టంగా కనిపిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

