5వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు నలందా విశ్వవిద్యాలయం నేపథ్యంలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో రూపొందిస్తున్న చిత్రం ‘గేమ్ ఆఫ్ ఛేంజ్’. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రానుంది. జాతీయ, అంతర్జాతీయ నటులతో ఈ చిత్రాన్ని రూపొందించారు. సిధిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సిద్ధార్థ్ రాజశేఖర్, మీనా చాబ్రియా నిర్మాతలు.
త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా ఇటీవల విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. గుప్తుడి కాలం నాటి యథార్థ సంఘటనలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని నిర్మాత, హీరో సిద్ధార్థ్ రాజశేఖర్ తెలిపారు. స్ఫూర్తివంతమైన కథాంశమిదని నిర్మాత మీనా చాబ్రియా పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీరాజ్ సాజి, దర్శకత్వం: సిధిన్.