కథానాయిక కేథరిన్ త్రెసా కొంత విరామం తరువాత ఓ సినిమాలో నటించనున్నారు. ‘జార్జిరెడ్డి’ ఫేమ్ సందీప్ మాధవ్ హీరోగా రూపొందనున్న ఈ చిత్రానికి ‘ఓదెల రైల్వేస్టేషన్’ చిత్ర దర్శకుడు అశోక్ తేజ దర్శకుడు.దావులూరి జగదీష్, పల్లి కేశవరావు నిర్మాతలు.
దర్శకుడు మాట్లాడుతూ ‘ఆసక్తికరమైన కథ, కథనాలతో రూపొందనున్న యాక్షన్ థ్రిల్లర్ ఇది. స్క్రీన్ప్లే కొత్తగా వుంటుంది. హీరో సందీప్, హీరోయిన్ కేథరిన్ పాత్రలు సర్ప్రైజింగ్గా వుంటాయి’ అన్నారు. ఈ నెలలోనే పూజా కార్యక్రమాలతో చిత్రాన్ని ప్రారంభిస్తామని నిర్మాతలు తెలిపారు.