లేటెస్ట్గా ‘ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న తిరువీర్ హీరోగా కొత్త సినిమా ఆదివారం హైదరాబాద్లో పూజాకార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. బ్లాక్బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత ఐశ్వర్య రాజేష్ కథానాయికగా తెలుగులో నేరుగా వస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. భరత్ దర్శన్ దర్శకుడు. మహేశ్వరరెడ్డి మూలి నిర్మాత. హిలేరియస్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపుదిద్దుకోనున్నదని, ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చే కథాంశంతో ఈ సినిమా రూపొందిస్తున్నామని చిత్రబృందం పేర్కొన్నది.
ఈ నెల 19 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని, తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సీహెచ్ కుషేందర్, సంగీతం: భరత్ మంచిరాజు, నిర్మాణం: గంగా ఎంటర్టైన్మెంట్స్.