మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న కొత్త సినిమా ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం). బ్లెస్సీ దర్శకుడు. ఏప్రిల్ 10న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానుంది. బుధవారం ఈ సినిమా నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ పోస్టర్ను హీరో ప్రభాస్ రిలీజ్ చేశారు. పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ.. ‘నా ఫ్రెండ్ ప్రభాస్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసుకోవడం ఆనందంగా ఉంది.
ఈ సినిమా కోసం ఐదేళ్లు కేటాయించాను. శారీరకంగా, మానసికంగా నజీబ్ క్యారెక్టర్లా మారిపోయాను’ అన్నారు. 90వ దశకంలో జీవనోపాధిని వెతుక్కుంటూ కేరళను విడిచి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవితంలోని వాస్తవ ఘటలను సినిమాలో చూపించబోతున్నారు. ఇది పూర్తిస్థాయిలో ఎడారిలో రూపొందుతున్న తొలి భారతీయ చిత్రం కావడం విశేషం.