అక్కినేని నాగార్జున (Nagarjuna) లీడ్ రోల్ నటిస్తున్న సినిమా ది ఘోస్ట్ (The Ghost). పీఎస్వీ గరుడ వేగ ఫేం ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా చివరి షెడ్యూల్ కోసం నాగార్జున అండ్ టీం కొన్ని రోజులుగా దుబాయ్‌లోనే ఉండిపోయింది. లేటెస్ట్ అప్ డేట్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. ది ఘోస్ట్ దుబాయ్ షెడ్యూల్‌ను పూర్తి చేసింది. ఈ చిత్రంలో నాగార్జున ఇంటర్ పోల్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. దుబాయ్‌లో యాక్షన్, టాకీ పార్టును షూట్ చేశారు.
దుబాయ్ చిత్రీకరణ పూర్తి చేసినట్టు తెలుపుతూ..షూటింగ్ లొకేషన్ నుంచి ఓ స్టిల్‌ను ట్విటర్ లో షేర్ చేశాడు ప్రవీణ్ సత్తారు. నాగ్‌తోపాటు హీరోయిన్ సోనాల్ చౌహాన్ (Sonal Chauhan) కూడా ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్టు తాజా స్టిల్‌తో తెలిసిపోతుంది. ఎడారిలో నాగ్ ఎలాంటి డూప్ లేకుండా చేసిన యాక్షన్ స్టంట్స్ కు సినిమాకే హైలెట్‌గా నిలువబోతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
#TheGHOST Dubai schedule is done @iamnagarjuna @sonalchauhan7 @PraveenSattaru @AsianSuniel #NarayanDasNarang #RamMohanRao @sharrath_marar @SVCLLP @nseplofficial pic.twitter.com/hU9GAf1uTL
— Praveen Sattaru (@PraveenSattaru) March 30, 2022
సోనాల్ చౌహాన్ మరోవైపు గ్లామరస్ అవతార్‌లో కూడా కనిపించనున్నట్టు ఇప్పటికే నెట్టింట్లో హల్ చల్చేస్తున్న ఫొటోలు చెబుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్ స్టార్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా ది ఘోస్ట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Chase the bad boys down the runway#TheGhost #TheGhostDubaiDiaries pic.twitter.com/e4hmSvLPvT
— Praveen Sattaru (@PraveenSattaru) March 21, 2022