ప్రతిష్టాత్మక GAMA (Gulf Academy Movie Awards) అవార్డ్స్, అయిదో ఎడిషన్ వేడుకలు శనివారం దుబాయ్‌లోని షార్జా ఎక్స్పో సెంటర్లో గ్రాండ్‌గా జరిగాయి. వైభవ్ జ్యూవెలర్స్ సమర్పణలో జరిగిన ఈ ఈవెంట్లో టాలీవుడ్ నుంచి పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. గామా బెస్ట్ మూవీగా ‘పుష్ప 2’, బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్, బెస్ట్ డైరెక్టర్‌గా సుకుమార్ అవార్డులను గెలుచుకున్నారు.
‘లక్కీభాస్కర్’ చిత్రంలో ఉత్తమ నటన కనపరచినందుకు గాను, ఉత్తమ నటి అవార్డును మీనాక్షి చౌదరి అందుకున్నారు. ఇంకా పలు విభాగాల్లో పలు చిత్రాలకు అవార్డులను అందజేశారు. గామా అవార్డ్స్ ఛైర్మన్ కేసరి త్రిమూర్తులు, సీఈఓ సౌరభ్ కేసరి ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ అవార్డుల కార్యక్రమం జరిగింది.