బాటనటుడిగా పలు చిత్రాల్లో నటించిన ఆనంద్ వర్ధన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘నిదురించు జహాపన’. ప్రసన్న కుమార్ దేవరపల్లి దర్శకుడు. సామ్.జి. వంశీకృష్ణ వర్మ నిర్మాతలు.
ఈ చిత్రం మోషన్ పోస్టర్ను ఇటీవల విడుదల చేసింది చిత్రబృందం. దర్శకుడు మాట్లాడుతూ ‘ఒక మనిషి నిద్రపోయిన తరువాత కలలు వస్తాయి. అయితే ఆ కల గురించి ఓ పది నిమిషాలు చెప్పుకుంటాం. మిగతా సమయం అంతా ఏం జరుగుతుందనేది ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది. అలాగే ఈ సినిమాలో హీరో ఆరునెలలు కంటిన్యూస్ నిద్రపోతూనే ఉంటాడు. అందుకే ఈ టైటిల్ పెట్టాం. సముద్ర నేపథ్య కథ ఇది’ అన్నారు.