సిజు విల్సన్, కయాదు లోహర్ ప్రధాన పాత్రల్లో నటించి మంచి విజయాన్ని సాధించిన మలయాళ సినిమా ‘పాథోన్పథం నూట్టండు’. వినయన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఆల్ ఇండియా ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మాత సీహెచ్ సుధాకర్ బాబు ‘పులి’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఎస్కే రామచంద్రనాయక్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 10న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ను తాజాగా హైదరాబాద్లో రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత సుధాకర్ బాబు మాట్లాడుతూ…‘కొత్త అనుభూతిని పంచే చిత్రమిది. పాటలు, ఫైట్స్, అందమైన విజువల్స్ ఆకట్టుకుంటాయి. వాస్తవికత నిండిన కథను తెరపై ఆవిష్కరిస్తుంది. మహిళలంతా చూడాల్సిన సినిమా ఇది. వారికి స్ఫూర్తినిచ్చేలా ఉంటుంది. మలయాళంలాగే ఇక్కడా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం’ అన్నారు.