అశిష్‌గాంధీ, మానస రాధాకృష్ణన్ జంటగా, దర్శక ద్వయం కిట్టి కిరణ్, లక్ష్మీచైతన్య దర్శకత్వంలో.. ఆర్.యు.రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ క్లాప్ ఇవ్వగా, నిర్మాత టి. ప్రసన్నకుమార్ కెమెరా స్విచాన్ చేశారు. తనికెళ్ల భరణి, నవీన్ ఎర్నేని, దర్శకుడు వీరశంకర్ స్క్రిప్ట్‌ని దర్శకులకు అందజేశారు. ఈ సందర్భంగా సినిమా బాగా రావాలని, మంచి విజయాన్ని సాధించాలని వారంతా ఆకాంక్షించారు. సమాజం తమకు ఎంతో ఇచ్చిందని, అందుకే మావంతుగా మేము కూడా సమాజానికి ఎంతోకొంత మేలు చేసే దృక్పథంతో ఈ సినిమా చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. టాలెంట్‌ని నిరూపించుకొనే అవకాశం ఇచ్చిన నిర్మాతకు దర్శకులిద్దరూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా తనకెంతో ప్రత్యేకమని కథానాయిక మానస చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా మెన్ జోషి. నిర్మాణం: సోనుది ఫిల్మ్ ఫ్యాక్టరీ.