హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): రియల్ ఎస్టేట్ కంపెనీ సాహితీ ఇన్ఫ్రా కేసులో సినీనటుడు జగపతిబాబును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించింది. గురువారం ఈడీ ఆఫీసుకు చేరుకున్న ఆయన్ను 4గంటలపాటు ప్రశ్నించింది.
ఈ కేసులో ఆయనపై ఎలాంటి ఆరోపణలు లేనప్పటికీ, ఆ కంపెనీకి చెందిన యాడ్స్‌లో నటించారు. ఈ క్రమంలో సంస్థ యజమానులకు, జగతిబాబుకు మధ్య ఆర్థిక లావాదేవీల గురించి ఈడీ ప్రశ్నించింది.