Kingdom Movie | స్టార్ హీరో విజయ్ దేవరకొండ నేడు 36వ ఏట అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అతడికి పలువురు సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 2011లో “నువ్విలా” సినిమాతో తన సినీ జీవితాన్ని ప్రారంభించిన విజయ్, 2015లో వచ్చిన “ఎవడే సుబ్రమణ్యం” చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అనంతరం 2016లో వచ్చిన పెళ్లిచూపులు, 2017లో వచ్చిన అర్జున్ రెడ్డి అతడికి స్టార్ ఇమేజ్‌ని తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత “మహానటి” (2018), “గీత గోవిందం” (2018) వంటి కమర్షియల్ సక్సెస్‌లను అందుకున్నాడు.
ప్రస్తుతం కింగ్డమ్ అనే సినిమాతో విజయ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా.. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుంది. సితార ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం మే 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నేడు విజయ్ బర్త్‌డే కానుకగా.. మూవీ నుంచి కొత్త పోస్టర్ని వదిలారు. ఈ పోస్టర్లో విజయ్ చాలా రఫ్‌గా, ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్‌తో పాటు, చిత్రబృందం త్వరలో మరిన్ని అప్డేట్లను విడుదల చేసే అవకాశం ఉంది.
Wishing the raging fire @TheDeverakonda a King Size Birthday Celebration 💥💥#KINGDOM is waiting for your full-blown show, firing up every corner with the euphoria only you can bring 🔥🔥#HBDVijayDeverakonda 💥🔥@AnirudhOfficial @gowtam19 #BhagyashriBorse @dopjomon… pic.twitter.com/EYa0Wrlt30
— Sithara Entertainments (@SitharaEnts) May 9, 2025