The Birthday Boy | ఇటీవల రొటిన్ కథలకు కాలం చెల్లిన విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు ఉన్న యువత కొత్తరకం కంటెంట్‌తో వైవిధ్యమైన అప్రోచ్‌తో సినిమాలు తీస్తూ కంటెంట్ ఈజ్ కింగ్ అని నిరూపిస్తున్నారు. అయితే రీసెంట్గా విడుదలైన ‘ది బర్త్‌డే బాయ్’ అనే చిత్రం ఈ కోవలోకే వస్తుంది. రవికృష్ణ, సమీర్ మళ్లా, రాజీవ్‌కనకాల ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘ది బర్త్‌డే బాయ్’ (The Birthday Boy). ఈ సినిమాకు విస్కి దర్శకత్వం వహించగా.. బొమ్మ బొరుసా పతాకంపై నిర్మించారు. యూత్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం జూలై 19న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అమెరికాలో చదువు కోసం ఒకే వూరి నుండి వెళ్లిన ఐదుగురు స్నేహితులు అక్కడ ఒకే ఇంట్లో వుంటారు. అందులో బాలు అనే స్నేహితుడి పుట్టినరోజు నాడు జరిగిన పార్టీలో మద్యం మత్తులో ఆ స్నేహితులు జరిపిన బర్త్ డే బంప్స్లో బాలు అనుకోకుండా చనిపోతాడు. దీంతో ఏం చేయాలో తెలియక ఆ నలుగురు స్నేహితుల్లో ఒకరి అన్నయ అయినా రవికృష్ణకు ఫోన్ చేసి పిలుస్తారు. అక్కడి వచ్చిన రవికృష్ణ ఆ సంఘటన చూసి షాక్ అవుతాడు. అయితే వీళ్ల అందరికి కామన్ ఫ్రెండ్ అయినా ప్రవీణ్.. బాడీని పరిశీలించి ఇది అనుకుకోండా జరిగిన మరణంలా లేదు మర్డర్లా వుందని అనుమనిస్తాడు. ఈ లోపు స్నేహితులు అందరూ బాలు వాళ్ల తల్లిదండ్రులను కేసు పెట్టకుండా కన్వీన్ చేసి అమెరికాకు రప్పిస్తారు? ఇక ఆ తరువాత కథలో చోటు చేసుకున్న పరిణామాలేంటి? అసలు బాలు కథేంటి? బాలు ఎలా మరణించాడు? బాలు చావుకు బర్త్‌డే బంప్స్ కారణం కాదా? ప్రవీణ్, భరత్‌లు కలిసి వాళ్ల స్నేహితులను ఎలా కాపాడారు? అనేది వెండితెరపై చూస్తేనే ఆసక్తకిరంగా వుంటుంది.
A Birthday Bash Filled with..🎂
Fear, Horror, and Tension!😯
Watch #Thebirthdayboy on aha!! 👉 ▶️https://t.co/4T8uHAu3Wl@actorsameersamo @rajeevco @pramodini15 @MAniGoudMG @vikranthved @Rchilam @RajaAsok999 @ShravanthiAnand @A_WHISKY_MAN @bharatgump @DopRahul @nareshadupa pic.twitter.com/v9P040z1t3— ahavideoin (@ahavideoIN) August 9, 2024
Also Read..