శక్తి వాసుదేవన్ హీరోగా, పూర్ణ, నాగబాబు, బ్రహ్మానందం, అలీ, సితార నిషాకొఠారి ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అలా ఎలా’. రాఘవ దర్శకత్వంలో కొల్లకుంట నాగరాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలోని పాటలు ఆదిత్య మ్యూజిక్ సంస్థ ఇటీవల హిందూపూర్‌లో జరిగిన ఓ వేడుకలో విడుదల చేసింది.
నిర్మాత మాట్లాడుతూ ‘నేను పుట్టి పెరిగిన ఊరు హిందూపూర్‌లో ఆడియో వేడుక జరగడం సంతోషంగా వుంది. జూలై 21న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’ అన్నారు.