వీబీ ఎంటర్టైన్మెంట్స్ 8వ ఫిలిం, టీవీ డైరెక్టరీ మరియు డిజిటల్ మీడియా అవార్డ్స్ ప్రదానోత్సవం బుధవారం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు, తమ్మారెడ్డి భరద్వాజ్, అంబికా కృష్ణ, మాదాల రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేఎస్ రామారావు మాట్లాడుతూ.. డిజిటల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు సినిమాల విషయంలో మితిమీరిన నెగెటివ్ ప్రచారానికి దూరంగా ఉండాలని సూచించారు.
నేటి సమాజాన్ని సోషల్మీడియా ఎంతగానో ప్రభావితం చేస్తున్నదని, కంటెంట్ క్రియేటర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తమ్మారెడ్డి భరద్వాజ్ పేర్కొన్నారు. ఈ వేడుకలో పలువురు టీవీ ఆర్టిస్టులు, డిజిటల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లకు అవార్డులను అందించారు.