Dhurandhar | బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్లో వచ్చిన భారీ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం, ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ (Netflix) లో సందడి చేయబోతోంది. ఈ సినిమా ఈరోజు అర్థ రాత్రి నుంచే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొత్తం 3 గంటల 25 నిమిషాల సుదీర్ఘ రన్ టైమ్తో కూడిన అన్కట్ వెర్షన్ను స్ట్రీమింగ్ చేయబోతున్నారు మేకర్స్. ప్రేక్షకులకు హోమ్ థియేటర్ అనుభూతిని అందించేలా ఈ చిత్రాన్ని 4K రిజల్యూషన్ మరియు డాల్బీ డిజిటల్ 5.1 ఆడియో క్వాలిటీతో అందుబాటులోకి తెచ్చారు. కేవలం హిందీలోనే కాకుండా, దక్షిణాది భాషల్లో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.
నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ ‘రా’ (RAW) ఏజెంట్గా పవర్ఫుల్ నటనను కనబరచగా, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో మెరిశారు. పాకిస్థాన్లోని ప్రమాదకరమైన ల్యారీ ప్రాంతంలో సాగే అండర్ కవర్ ఆపరేషన్ నేపథ్యంలో ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ చిత్రానికి సీక్వెల్గా ‘ధురంధర్ 2’ కూడా రూపొందుతోంది, అది మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది.

Dhurandhar Ott