Mallika Sherawat | అందుకే ఇండియా వదిలేసి వెళ్లిపోయాను : మల్లికాశెరావత్
ఒకానొక టైంలో బాలీవుడ్ (Bollywood)లో బిజీ నటిగా ఉన్న మల్లికాశెరావత్ (Mallika Sherawat)..కొంత కాలంగా సిల్వర్ స్క్రీన్ కు దూరమైంది. బోల్డ్ నటనతో భారత సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ఒకానొక టైంలో బాలీవుడ్ (Bollywood)లో బిజీ నటిగా ఉన్న మల్లికాశెరావత్ (Mallika Sherawat)..కొంత కాలంగా సిల్వర్ స్క్రీన్ కు దూరమైంది. బోల్డ్ నటనతో భారత సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హిందీ, తమిళం, చైనీస్, ఇంగ్లీష్ చిత్రాల్లో నటించింది. 2010 లాస్ ఏంజెల్స్ (Los Angeles) నుంచి పౌరసత్వాన్ని అందుకుంది. అయితే మల్లికాశెరావత్ కొన్ని సందర్భాల్లో చాలా విమర్శలనే ఎదుర్కొంది. ఎంతలా అంటే వాటి బాధ తట్టుకోలేక ఇండియాను వదిపెట్టేంతలా. అదే విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
‘మహిళల పట్ల భారతీయుల వైఖరి మారిపోయింది. ఇంతకుముందు కంటే భారతీయులు బెబ్ సిరీస్, సినిమాలో న్యూడిటీ, బోల్డ్ సన్నివేశాలను చాలా వరకు అంగీకరిస్తున్నారు. మహిళా నటీనటుల కోసం రచయితలు మరింత సాహసోపేతమైన పాత్రలు రాస్తున్నారని మల్లికాశెరావత్ పేర్కొంది. కెరీర్ తొలినాళ్లలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న హీరోయిన్లలో మల్లికాశెరావత్ ఒకరు. గతంలో ఎదుర్కొన్న ఛేదు అనుభవాల గురించి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

ఓ సెక్షన్ మీడియా నన్ను బెదిరించడం, వేధించడం, సామాన్య ప్రజానీకం, జడ్జ్ చేయడం లాంటి వాటిని తట్టుకోలేకపోయాను. మీకు (మీడియా) కూడా ఈ విషయం తెలుసు. వాళ్లు నా పట్ల చాలా దుర్మార్గంగా ఎందుకు వ్యవహరించారో నాకు తెలియదు. నా గురించి అబద్ధాలు రాశారు, కథనాలు సృష్టించిన వారిలో మెయిన్ స్ట్రీమ్ మీడియా వ్యక్తులు కూడా చాలా మందే ఉన్నారు. వాళ్లు నాతో ఎప్పుడూ చెప్పని తప్పుడు విషయాలను నాకు ఆపాదించారు.
వాళ్లు కొంతమంది వ్యక్తులతో నా పేరు లింకప్ చేసి స్టోరీలు రాశారు. ఇది చాలా ఎక్కువైపోయిందని, ఇలాంటి నెగెటివిటీ నా జీవితానికి అవసరం లేదనుకున్నా.ఆ పరిణామాలతో నా హృదయం బద్దలైంది. నేను తెలివిగా బతికేందుకు దేశం విడిచిపోవాలనుకుంటున్నట్టు చెప్పా. అందుకే ఇండియాను వదిలి వచ్చేశానని’ చెప్పుకొచ్చింది మల్లికాశెరావత్.
ఇవి కూడా చదవండి..
Raviteja Heroines | హీరోయిన్ల సాయం తీసుకుంటున్న రవితేజ
Shalini Pandey | అనుకోకుండా బాలీవుడ్ అవకాశం : షాలినీ పాండే
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

