వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్నారు స్టార్ హీరో పవన్ కళ్యాణ్. ఆయన చేస్తున్న సినిమాల్లో ఆసక్తి కలిగిస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం సెట్ వర్క్ పూర్తి చేసుకుంటుంది. ఈ ఫొటోలను నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, సినిమాటోగ్రాఫర్‌తో కలిసి దర్శకుడు హరీష్ సెట్స్‌ను పరిశీలిస్తున్న ఫొటోలను పంచుకుంది. త్వరలో షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు ఈ ట్వీట్లో నిర్మాణ సంస్థ వెల్లడించింది.
ఇక ఈ చిత్ర షూటింగ్లో పవన్ కళ్యాణ్ ఏప్రిల్ 5వ తేదీ నుంచి పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో శ్రీలీల లేదా పూజా హెగ్డే నాయికగా నటించనుందని తెలుస్తున్నది. ఈ చిత్రంతో పాటు పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’, సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్), సాయి ధరమ్‌తేజ్‌తో కలిసి ‘వినోదయ సితమ్’ రీమేక్‌లో నటిస్తున్నారు.