Nayanthara | అందుకే ఈవెంట్స్‌కు వెళ్లడం మానేశా.. హాట్ టాపిక్‌గా నయనతార కామెంట్స్
అశ్విన్ శరవనన్ (Ashwin Saravanan) దర్శకత్వంలో హార్రర్ థ్రిల్లర్స్ జోనర్లో తెరకెక్కిన కనెక్ట్ (Connect) మూవీ మంచి టాక్ తెచ్చుకుంటోంది. గతంలో ఎన్నడూ ప్రమోషన్స్‌లో పాల్గొనని నయనతార తొలిసారి ఈ సినిమా కోసం ఇంటర్వ్యూలు ఇస్తోంది.
లేడీ సూపర్‌స్టార్ నయనతార (Nayanthara) లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం కనెక్ట్ (Connect). అశ్విన్ శరవనన్ (Ashwin Saravanan) దర్శకత్వంలో హార్రర్ థ్రిల్లర్స్ జోనర్లో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాగా మంచి టాక్ తెచ్చుకుంటోంది. గతంలో ఎన్నడూ ప్రమోషన్స్‌లో పాల్గొనని నయనతార తొలిసారి ఈ సినిమా కోసం ఇంటర్వ్యూలు కూడా ఇస్తోంది. ఇంటర్వ్యూలో పెళ్లి,అమ్మగా ప్రమోషన్స్ పొందడం, తన ఫిలిం ఇండస్ట్రీ ప్రయాణంలో చూసిన అసమానతల గురించి మాట్లాడింది.
హీరోలకు ఇచ్చిన ప్రాధాన్యత హీరోయిన్లకు ఇవ్వకపోవడం వల్ల తాను సినిమా ఈవెంట్స్ కు వెళ్లడం మానేశానని చెప్పింది నయనతార. ‘నేను ఇండస్ట్రీలో రెండో దశాబ్దపు ప్రయాణాన్ని మొదలుపెట్టినపుడు నాకు కొన్ని కలలున్నాయి. అప్పట్లో ఉమెన్ సెంట్రిక్ సినిమాలు లేవు, స్త్రీలకు తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదు. హీరోయిన్లకు కనీస ప్రాధాన్యత కూడా ఎందుకు ఇవ్వలేకపోయేవారో చూసి ఆశ్చర్యమేసేది. ఒకవేళ మేం (హీరోయిన్లు) ఏదైనా ఆడియో ఫంక్షన్‌కు హాజరైనా, మమ్మల్ని ఏ మూలనో నిలబట్టే పరిస్థితి ఉండేది. ఇలాంటి కారణాల వల్లే నేను సినిమా ఈవెంట్స్ కు వెళ్లడం మానేశా’నని చెప్పి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.
మరి భవిష్యత్‌లో హీరోయిన్లకు కూడా హీరోలతో సమాన గౌరవమిచ్చేలా కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టాలని నయనతార గట్టిగానే ఫిక్సయినట్టు తాజా కామెంట్స్ తో అర్థమవుతుంది. కనెక్ట్ చిత్రంలో బాలీవుడ్ దర్శకనిర్మాత, నటుడు అనుపమ్ ఖేర్‌తోపాటు సత్యరాజ్, వినయ్ రాయ్, హనియ నఫిస కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై నయనతార భర్త విఘ్నేశ్ శివన్ తెరకెక్కించాడు. ఈ చిత్రానికి పృథ్వి చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.
నయనతార కనెక్ట్ టీజర్.. వీడియో
Read Also : Trivikram Srinivas | తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం చాలా గొప్పది: త్రివిక్రమ్ శ్రీనివాస్
Read Also :Butterfly | అనుపమ పరమేశ్వరన్ బట్టర్ ఫ్లై నుంచి అమ్మ వీడియో సాంగ్
Read Also : Hombale Films | హోంబలే ఫిలిమ్స్ టార్గెట్ ఫిక్స్.. నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్కు భారీ ప్లాన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

