మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కాంబినేషన్ లో వస్తున్న చిత్రం సీతారామమ్ (Sita Ramam). పీరియాడిక్ లవ్‌స్టోరీ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రానికి హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వం వహిస్తున్నాడు. కన్నడ సోయగం రష్మిక మందన్నా కీ రోల్ చేస్తోంది. డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్, సుమంత్ అక్కినేని, ప్రకాశ్ రాజ్, గౌతమ్ మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
కాగా తరుణ్ భాస్కర్ ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేసిన స్టిల్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. తరుణ్ భాస్కర్, రష్మికతో లైబ్రరీలో ఉన్నపుడు తీసిన ఫన్నీ స్టిల్‌ను పోస్ట్ చేశాడు. ఈ ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తుండటం తాజా లుక్‌లో చూడొచ్చు. సీతారామంలో రష్మిక ( Rashmika Mandanna) కశ్మీరీ యువతి అఫ్రీన్‌గా, సుమంత్ బ్రిగేడియర్ విష్ణు శర్మగా, తరుణ్ భాస్కర్ లుక్ (Tharun Bhaskar) బాలాజీగా నటిస్తున్నారు నటిస్తున్నాడు. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.
వైజయంతీ మూవీస్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్ బ్యానర్‌పై స్వప్న దత్ నిర్మిస్తున్నారు. సీతారామంకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఆగస్టు 5న గ్రాండ్‌గా విడుదల కానుంది.