Thandel Movie On Netflix | నాగచైతన్య(Naga Chaitanya ), సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటించిన తండేల్ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిన విషయం తెలిసిందే. దాదాపు రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి నాగచైతన్య కెరీర్లో తొలి రూ.100 కోట్ల చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించగా.. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ తాజాగా తండేల్ ఓటీటీ అనౌన్స్‌మెంట్‌ను పంచుకుంది. తండేల్ సినిమా మార్చి 07 నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది.
\ఈ సినిమా కథ విషయానికి వస్తే.. శ్రీకాకుళం జిల్లా మత్స్యలేశ్యం గ్రామానికి చెందిన జంట రాజు (నాగచైతన్య), సత్య (సాయిపల్లవి). ఇద్దరూ మత్యకారుల కుటుంబాలకు చెందినవారే. చిన్నప్పట్నుంచీ కలిసి పెరిగారు. కలిసి బతకాలనుకున్నారు. సత్యకు రాజు అంటే ప్రాణం. రాజుకు సత్యే లోకం. రాజు చేపల వేటకు వెళ్లి నెలల తరబడి రాకపోయినా… అతని జ్ఞాపకాలతో బతికేస్తుంది సత్య. తనవారికోసం నిలబడే తెగువ, ధైర్యం, మంచితనం.. ఇవన్నీ రాజును తమ జాతికి తండేల్గా నిలబెట్టాయ్. అయితే.. చాపలవేటకు వెళ్లి సముద్రంలో ప్రాణాలు కోల్పోతున్న తనవాళ్లను చూస్తూ సత్య మనసులో కలవరం మొదలైంది. ఎలాగైనా రాజుతో చేపలవేట మాన్పించాలని ప్రయత్నించింది. కానీ.. రాజు మాత్రం సత్య మాట వినలేదు. బాధ్యతకోసం కట్టుబడి, తనను నమ్మకున్నవారి కోసం వేటకు వెళ్లాడు. సత్య మనసు గాయపడింది. తన మాటను పెడచెవిన పెట్టిన రాజును మనసులోంచి చెరిపేయాలనుకుంది. మరొకరితో పెళ్లికి సిద్ధమైంది. ఇంతలో పిడుగులాంటి వార్త. సముద్రంలో చేపలవేటకు వెళ్లిన రాజు బృందం.. అక్కడ తుఫాన్లో చిక్కుకొని, అందులోంచి బయట పడే ప్రయత్నంలో తమ ప్రమేయం లేకుండానే పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి ప్రవేశించి పాకిస్తాన్ నేవీ అధికారులకు దొరికిపోయారు. ఈ వార్త విని మత్స్యలేశం గ్రామం విలవిలలాడింది. సత్య షాక్‌కు గురైంది. మరి పాకిస్తాన్ కరాచీ సెంట్రల్జైల్లో బంధీలుగా ఉన్న రాజు బృందం ఎలా బయటపడింది? సత్య వేరొకరిని పెళ్లాడిందా? శత్రుదేశంలో బంధీగా చిక్కుకున్న రాజుకోసం సత్య చేసిన ప్రయత్నాలేంటి? చివరకు సత్య, రాజుల ప్రేమకథ సుఖాంతమైందా? దుఖాంతంగా మిగిలిపోయిందా? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
Prema kosam yedu samudhralaina dhaatadaniki osthunnadu mana Thandel! 😍❤️
Watch Thandel, out 7 March on Netflix in Telugu, Hindi, Tamil, Kannada & Malayalam!#ThandelOnNetflix pic.twitter.com/GIBBYHnME9— Netflix India South (@Netflix_INSouth) March 2, 2025