Thandel | నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘తండేల్’ చిత్రం నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నది. ఇటీవల విడుదలైన పాటలకు కూడా మంచి స్పందన లభిస్తున్నది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు. ఈ నెల 28న థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
ఇందులో నాగచైతన్య యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఓ మత్స్యకార గ్రామంలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జాలరుల జీవన సంఘర్షణతో పాటు దేశభక్తి ప్రధానంగా ఈ సినిమా ఆకట్టుకుటుందని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శ్యామ్‌దత్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సమర్పణ: అల్లు అరవింద్, నిర్మాత: బన్నీ వాసు, రచన-దర్శకత్వం: చందూ మొండేటి.