Naga Chaitanya | టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం తండేల్ (Thandel). మలయాళీ బ్యూటీ సాయి పల్లవి కథనాయికగా నటిస్తుండగా.. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు ఎసెన్స్ ఆఫ్ తండేల్ (Essence Of Thandel) అంటూ గ్లింప్స్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ మూవీ విడుదలకు సంబంధించి ఒక సాలిడ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఈ సినిమాను సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర దర్శకుడు చందు మొండేటి ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే విషయంపై చందూ మట్లాడినట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇందులో సంక్రాంతి బరిలో మేము కూడా ఉన్నాం. తండేల్ షూటింగ్ దగ్గరికి వచ్చేసింది. ఇంకా పదిరోజులలో మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. ఒకవేళ సంక్రాంతికి చరణ్ ఉన్నాడు కదా అని చిత్ర నిర్మాత అరవింద్ గారు ఆలోచిస్తే మాత్రం జనవరి బరిలో ఉండము. అంటూ చందూ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు సంక్రాంతికి ఇప్పటికే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌తో పాటు బాలకృష్ణ 109 సినిమా బరిలో ఉన్నాయి.